తరచుగా ప్రయాణాలను ఇష్టపడే జర్నీ ప్రియులు ప్రపంచంలోని మోస్ట్ ఎక్స్ ట్రీమ్ ప్రాంతాలు ఏవి ? అనే విషయాన్నీ ఎప్పుడైనా ఆలోచించారా ? జర్నీని బాగా ఇష్టపడే వారు ఖచ్చితంగా ఈ ఎక్స్ ట్రీమ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు, అద్భుతమైన సహజ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రదేశాలు లైఫ్ టైం ట్రిప్ ను పరిపూర్ణంగా చేస్తాయి. అంటే వీటిని లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.

ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశం
భూమిపై అతి శీతల ఖండంగా పేరుగాంచిన అంటార్కిటికా తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో ఉంటుంది. తూర్పు అంటార్కిటిక్ పీఠభూమి భూమిపై అతి శీతల ప్రదేశం  అని అంటారు. ఇక్కడ 2004, 2016 మధ్య శాటిలైట్ డేటా గాలి ఉష్ణోగ్రతలు -94 ° C ఉన్నట్లు చూపించింది.

ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతం అటకామా ఎడారి, చిలీ
ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశాన్ని సందర్శించడం మీ టూర్ లిస్ట్ లో లేకపోయినప్పటికీ, చిలీలోని అటకామా ఎడారిని చూసి తీరాల్సిందే. ఇది భూమిపై పొడిగా, ఎత్తైన ధృవ రహిత ఎడారి. కానీ ఇక్కడ విశాలమైన నక్షత్రాలతో కూడిన రాత్రి ఆకాశం, భూఉష్ణ ప్రకృతి దృశ్యాన్ని చూడడానికి ఒక అద్భుత ప్రదేశం. ఎడారి సాహసాలను ఇష్టపడే వారికి ఈ ట్రిప్ బాగా నచ్చుతుంది.

ప్రపంచంలో అత్యంత హాటెస్ట్ ప్రదేశం డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా
ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మానుష్య ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదు కావన్న విషయం తెలిసిందే. అయితే అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసే ప్రదేశం గురించి గురించి తెలుసా ? అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసే ప్రాంతం డెత్ వ్యాలీ, కాలిఫోర్నియాలో ఉంది. ఇక్కడ 134 ° F (57 ° C) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైంది.

ప్రపంచంలో అత్యంత తడి ప్రదేశం మౌసిన్రామ్, భారతదేశం
ఈ వింత గ్రామం సంవత్సరానికి 500 మిల్లి మీటర్ల వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఇది గ్రహం మీద అత్యంత తడి ప్రదేశంగా రికార్డు నమోదు చేసింది. బంగాళాఖాతం నుండి తేమతో కూడిన రుతుపవనాలు గాలులు మౌసిన్‌ రామ్ చుట్టు పక్కల పర్వతాలను తాకినప్పుడు వర్షపాతం సంభవిస్తుందని నిపుణులు అంటారు. ఇది వర్షం పడే బెస్ట్ ప్లేసెస్ లలో ఒకటి.

పొడి భూమిపై ప్రపంచంలోనే అత్యల్ప స్థానం డెడ్ సీ
డెడ్ సీ జోర్డాన్ లో ఉంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యలో ఉండే ఈ ప్రదేశం గ్రహం మీద అతి తక్కువ పొడి భూమిని కలిగి ఉంది. ఈ హైపర్సాలిన్ సరస్సులో ఉన్న ఉప్పు తేలుతుంది. వాస్తవానికి డెడ్ సీ నీరు సాధారణ సముద్రపు నీటి కంటే 10 రెట్లు ఎక్కువ లవణీయంగా ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత మారుమూల ద్వీపం బౌవెట్ ద్వీపం
సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా మధ్య ఉంది ఈ ప్రాంతం. ఈ చిన్న ద్వీపం ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతం. ఇది జనావాసాలు లేని మంచు గడ్డ. దాదాపు పూర్తిగా మంచుతో కప్పబడి, హిమానీ నదాల చుట్టూ బౌవేట్ ద్వీపం  ఉంటుంది. ఈ ప్రదేశంలో కొన్ని వింతైన సంఘటనలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: