సాధారణంగా అంజీర్ పండ్లను పచ్చిగా వున్నప్పుడు తినడానికి చాలా మంది ఇష్టపడరు.కానీ అంజిర్ డ్రై ఫ్రూట్స్ గా తీసుకోవడానికి మాత్రం బలే ఇష్టపడతారు.దీర్ఘకాళిక వ్యాధిగ్రస్తులలు అత్తి పండ్లను తరుచూ తీసుకోవడం చాలా మంచిది.వీటిని సాధారణంగా తీసుకునేకన్నా పాలలో నానబెట్టి తీసుకోవడం చాలా ఉపయోగకరమట.అంజీర్ లో విటమిన్ ఎ,సి,ఇ, కె,
ఫైబర్,మెగ్నీషియం,కాల్షియం,పొటాషియంమరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
 

అంజీర పండ్లను పాలలో నానబెట్టి,వాటిని తింటూ అ పాలను తాగడం వలన మధుమేహంతో బాధపడేవారే రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్ గా ఉంటాయి.అంజీర్ కలిపిన పాలను త్రాగటం వల్ల,జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసి,అజీర్తి,మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.పైగా జీర్ణ వ్యవస్థ దృఢంగా తయారవుతుంది.ఈ పాలను చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల,అందులోని జింక్ మెదడు కణజాలం పెరిగేందుకు దోహదపడి,వారి జ్ఞాపక శక్తి చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరియు ఇది మీ జీవక్రియా రేటు మెరుగుపరచి,బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.అధికబరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.ఇందులోని మెగ్నీషియం గుండె కండరాలను దృఢపరిచి,గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడుతుంది.ఆస్తియోపొరోసిస్ బాధపడేవారికి అంజిర్ కలిపిన పాలను తరచూ ఇవ్వడం వల్ల అందులోని కాల్షియం వారి ఎముకలను బలపరిచి,వ్యాధి తీవ్రత తగ్గించేందుకు ఉపయోగపడతాయి.అసలు అంజీర్ పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండీ..

అంజీర్ పాలను తయారు చేసుకునేందుకు ముందుగా ఒక మందంపాటి పాన్ తీసుకోని,అందులో ఒక గ్లాసు పాలు వేసి వేడి చేయాలి.అవి బాగా మరిగిన తరువాత,అందులో 3 నానబెట్టిన అంజీర్ పళ్లను వేసి బాగా వుడికించాలి.అ పాలలో ఉడుకుతున్న అంజీర్ పళ్లను పూర్తిగా మిక్స్ అయ్యేలా స్మాష్ చేయాలి.అ తర్వాత పాన్ స్టవ్ మీద నుంచి దింపి,అందులో రెండు టీ స్పూన్ల తేనె కలిపిన పాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి.ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లు ఎటువంటి సీజనల్ వ్యాధులను దరిచేరనివ్వవు.

మరింత సమాచారం తెలుసుకోండి: