యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యాం. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఆఫ్టర్ లాక్ డౌన్ షూటింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా యూనిట్ త్వరలోనే ఫారిన్ ట్రిప్ వేతారని తెలుస్తుంది.

ఇదిలాఉంటే ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక రాధే శ్యామ్ టీజర్ ను ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. టీజర్ కు సంబందించిన ఎడిటింగ్ వర్క్ రీసెంట్ గా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. టైటిల్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచిన రాధాకృష్ణ ఈసారి టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేస్తాడని అంటున్నారు.

పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధే శ్యామ్ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ దశాబ్ధం గుర్తుండిపోయే ప్రేమకథగా ఈ సినిమా వస్తుందట. మరి రాధే శ్యామ్ అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి. 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: