
నిజానికి ఈ సినిమా కథ రాహుల్ సంకృత్యాన్ రాయ లేదట. ఒక ప్రముఖ ఆడియో కంపెనీ లో మేనేజర్ గా పని చేస్తున్న ఒక రచయిత ఈ కథను రాశారట. అయితే ఆ మేనేజర్ తాను రాసిన కథను మొదటిలో నానికి వినిపించగా.. ఆ కథ నాని కి బాగా నచ్చేసిందట. అందుకే ఆ కథను రూ. 50 లక్షల పెట్టి కొనుగోలు చేశారట. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాని రూ. 50 లక్షల కథతోనే తెరకెక్కిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాకి దర్శకత్వం వహించే రాహుల్ సంకృత్యాన్ ఈ కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇకపోతే ఈ సినిమాలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. చిత్ర బృందం ఇప్పటికే సాయి పల్లవి ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ఏ.ఆర్.రెహమాన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత బాణిలు అందిస్తే.. శ్యామ్ సింగరాయ్ ఆడియో పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు.