బాలీవుడ్ లో
రణవీర్ సింగ్ ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలలో చాలా ముంద ఉన్నారు .ఆయన ఈ మధ్య తీసిన సినిమాలన్నీ
బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులోనూ
ఎన్టీఆర్ టెంపర్ సినిమా హిందీ రీమేక్ సింబ మరియు
గల్లీ బాయ్ సినిమాలు దాదాపుగా 200 కోట్ల పైగా కలక్షన్స్ సంపాదించాయి. దాంతో ఆయన సినిమాలంటే నిర్మాతలు క్యూ కడుతున్నారు . అలాగే సినిమాల ఎంపిక విషయంలో
రణవీర్ సింగ్ చాలా జాగ్రత్తగా ఉంటారు .ఆయన ప్రస్తుతం చేస్తున్న
సినిమా 83
సినిమా ప్రముఖ క్రికెటర్ మన దేశానికి మొదటి సారి
వరల్డ్ కప్ తీసుకువచ్చిన కెప్టెన్
కపిల్ దేవ్ బయోపిక్. ఈ
సినిమా షూటింగ్ లో ప్రస్తుతం
రణవీర్ సింగ్ బిజీగా ఉన్నారు. ఇక ఈ రోజే ఈ
సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు
మూవీ టీం. ఈ సంవత్సరం
జూన్ 4న ఈ
సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాతో
రణవీర్ సింగ్ సౌత్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ 83
సినిమా తెలుగు,
తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతుంది .ఇప్పటిదాకా
హిందీ సినిమాల్లో కోట్లు కొల్లగొట్టిన
రణవీర్ సింగ్ ఇప్పుడు సౌత్
మార్కెట్ మీద కన్నేశాడు. ఈ సినిమా
సౌత్ లో విడుదల ఎందుకంటే క్రికెటర్
కపిల్ దేవ్ గురించి దేశమంతటా అందరికీ తెలుసు. దాంతో ఇది
సినిమా మార్కెట్ కి కూడా బాగా ఉపయోగపడుతుందని ఈ సినిమాని
సౌత్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో
రణవీర్ సింగ్ తో పాటు చాలామంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు .అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాని
రణవీర్ సింగ్ భార్య అలాగే ప్రముఖ నటి
దీపికా పడుకొనే కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక ఈ
సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో విడుదల వరకు వేచి చూడాలి.