సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ కాంబోలు ఉండడం సర్వసాధారణం. కొంతమంది కలిసి పనిచేసిన సినిమాలు వరుస హిట్‌లుగా నిలుస్తుంటే.. వాళ్లది సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరు పడుతుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లున్నాయి. అలాంటి వాటిలో ఒకటి
తమిళ యువ దర్శకుడు
అట్లీ కుమార్-స్టార్
హీరో ఇలయదళపతి విజయ్‌ది కూడా. వీరిద్దరూ కలిసి
సినిమా చేశారంటే చాలు అది సూపర్ హిట్ అనే చెప్పాలి. అట్లీతో
విజయ్ చేసిన ప్రతి
సినిమా హిట్ అయింది. తొలి సినిమాతో వీరిది బెస్ట్ కాంబోగా పేరు సంపాదించింది.
.jpg)
2013లో
ఆర్య, జై,
నయనతార, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రాజా
రాణి సినిమా ద్వరా
అట్లీ కుమార్ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని విజయ్‌ను కలిశాడు. అతడితో తన తొలిసినిమాగా తెరి(తెలుగులో పోలీస్) చిత్రం తెరకెక్కించాడు. 2016లో విడుదలైన ఈ
సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.75 కోట్లతో తెరకెక్కిన ఈ
సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది. దీంతో
అట్లీ ఓవర్ స్టార్
డైరెక్టర్ అయిపోయాడు.
విజయ్ కూడా అట్లీకి వరుస అవకాశాలిచ్చాడు.

విజయ్‌తో తొలి సినిమానే హిట్ కావడంతో రెండో
సినిమా కథను కూడా రెడీ చేసుకున్నాడు అట్లీ.
విజయ్ కూడా ముందుకొచ్చాడు. అలా 2017లో వీరిద్దరి కాంబినేషన్లో మెర్సల్(తెలుగులో అదిరింది)
సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో
విజయ్ డ్యూయల్ రోల్ చేయగా ఎస్‌జే
సూర్య విలన్‌గా నటించాడు. ఈ
సినిమా కూడా తమిళంలో
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రూ.120 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ
సినిమా ఓవరాల్‌గా రూ.300 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.

రెండు
సినిమా భారీ హిట్లు కావడంతో నిర్మాతలు కూడా వీరి కాంబినేషన్‌పై ఆసక్తి చేపించారు. దీంతో ఆ మరుసటి ఏడాదే మరో
సినిమా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది. అదే 2019లో విడుదలైన బిగిల్(విజిల్).
బిగిల్ సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. కానీ నిర్మాతలకు ఆశించినంత లాభాలు రాలేదని టాక్. అయినప్పటికీ 180 కోట్లతో తెరకెక్కిన ఈ
సినిమా రూ.280 నుంచి రూ.300 కోట్ల వరకు వసూళ్లు సాధించి 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన
తమిళ సినిమాగా నిలిచింది.

ఇదిలా ఉంటే పై మూడు సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో గత మూడేళ్లలో ఒక్క
సినిమా కూడా రాలేదు. అయితే ప్రస్తుతం
అట్లీ కుమార్ విజయ్ కోసం ఓ
సినిమా కథను రెడీ చేస్తున్నట్లు
తమిళ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి అదే నిజమైతే మరో సూపర్ హిట్ సినిమాకు రెడీ అవ్వాల్సిందే.