
అందుకే హీరోలు వచ్చినప్పుడు ఎలా ఉన్నప్పటికీ హీరోయిన్లు వచ్చినప్పుడు మాత్రం చుట్టూ బాడీగార్డులు ఉండడం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా హీరోయిన్ ల వైపు తోసుకు వస్తూ ఉంటే వారిని నిలువరిస్తూ ఉంటారు బాడీగార్డులు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తోపులాట కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సారా అలీ ఖాన్ కారులో ఎక్కుతున్న సమయంలో అటు ఫోటోగ్రాఫర్లు కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎలాగైనా ఫోటో తీయాలి అని భావించారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్ ల మధ్య తోపులాట జరిగింది.
దీంతో సారా అలీ ఖాన్ వైపు ఫోటోగ్రాఫర్లు తోసుకుంటూ రావడంతో ఇక బాడీగార్డులు ఫోటోగ్రాఫర్లను తోసేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సారా అలీ ఖాన్ పబ్లిక్‌గానే ఏకంగా మీడియాకు క్షమాపణలు చెప్పింది. ఇలా సారా అలీ ఖాన్ కాలలోకి వస్తున్న సమయంలో కొద్దిగా తోపులాట జరగడంతో సారా అలీ ఖాన్ బాడీగార్డ్ ఒక ఫోటోగ్రాఫర్ నీ తోసేయ్యగా కార్లోంచి బయటకి వచ్చిన సారా అలీ ఖాన్ తన బాడీ గార్డ్ తరఫున తాను తరఫున క్షమాపణలు చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సారా అలీ ఖాన్ సింప్లిసిటీ కి ఫోటోగ్రాఫర్లు అందరూ ఫిదా అయిపోయారు.