తెలుగు అగ్ర మాస్ మహరాజ రవితేజ ఏడాదికి రెండు సినిమాలు తీసినా కూడా ఆ అతనికి ఈ మాత్రం అనుకున్న పేరును తీసుకురాలేదు. కాగా, ఇటీవల వచ్చిన క్రాక్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. దీంతో మళ్ళీ రవి తేజ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.


ముందుగా ఖిలాడీ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దంగా వుంది. సినిమా పై అంచనాలను పెంచుతున్న చిత్రయూనిట్ ఒక్కో సింగిల్ ను వదులుతూ వస్తున్నారు.ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా మాస్ అభిమానులను తెగ ఆకర్షించాయి.. ఇదే జోష్ ను కోనసాగించెలా తాజాగా మరో సాంగ్ ను విడుదల చేశారు.క్యాచ్‌ మీ అంటూ సాగే ఈ పాటలో.. డింపుల్‌ హయాతీ, రవితేజ మధ్య హాట్‌ సీన్స్‌ బాగా వర్కౌట్‌ అయ్యాయి. మొత్తానికి ఆ పాట ఓ ఊపు ఊపెసింది. తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్..


అందులో రవితెజ పై చిత్రీకరించిన సన్నివెసాలు అంచనాలను మరింత పెంచేశాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, శేఖర్ మాస్టర్ స్టెప్పులు కూడా దుమ్ములేసిపోయింది.. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియేస్, ఎల్ఎల్పీ బ్యానర్లపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: