దర్శకుడు రమేష్ వర్మ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. రవితేజ హీరోగా నటించిన వీర చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆయన పేరు బయట ఎవరికీ పెద్దగా తెలియకుండా పోయింది. ఆ చిత్రం హిట్ అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. ఆ విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేజేతులా నేలపాలు చేసుకున్నాడు రమేష్ వర్మ.

వీర చిత్రం తర్వాత కొన్ని సినిమాలతో మళ్లీ హిట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సినిమాలేవీ కూడా ఆయనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు దీంతో మళ్లీ రవితేజ తో హీరోగా సినిమా చేయాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. రవితేజ ఖాళీగా లేకపోవడం వల్ల అంత తొందరగా ఆయన ఆయనకు సినిమా ఇవ్వలేకపోయాడు. ఎట్టకేలకు ఈ సినిమాతో మరో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ అవకాశాన్ని అసలు జారవిడిచి కూడదు అని చెప్పి తప్పకుండా మంచి సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించాలని రమేష్ వర్మ భావించి ఈ కథను రవితేజ కు  చెప్పి ఆయనతో ఒప్పించాడు. 

వాస్తవానికి ముందుగా ఈ దర్శకుడితో రవితేజ కిలాడి సినిమా చేయాలనుకోలేదట ఇప్పటికే తమిళంలో సూపర్ హిట్ అయిన శతురంగ వెట్టై 2 అనే సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో చేయాలని భావించాడు రవితేజ. కానీ స్క్రిప్ట్ దశలో ఆ చిత్రం యొక్క హీరో కథకు తన బాడీ లాంగ్వేజ్ సరిపోదు అని తెలుసుకున్న రవితేజ ఆ చిత్రాన్ని చేయవద్దని భావించాడట. దీంతో ఈ  సినిమా ఎక్కడ పోతుందో అని రమేష్ వర్మ అదే సమయానికి తన వద్ద ఉన్న ఈ ఖిలాడి కాన్సెప్ట్ ను  వినిపించగా ఈ సినిమా చేయడానికి రవితేజ  ఒప్పుకున్నాడట  ఆ విధంగా రవితేజ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: