సీనియర్ హీరో రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో వచ్చిన మూవీ "ఖిలాడీ". కోనేరు సత్య నారాయణ నిర్మించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. క్రాక్ సినిమాతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని అదే ఫుల్ జోష్‌తో ఇపుడు ఖిలాడీ సినిమాతో వచ్చేశారు. కాగా మొదటి రోజు టాక్ అంచనాలకు మించి వినిపించినా ఇపుడు క్రమంగా డల్ అవుతోంది అని తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా రాలేదు. నెమ్మదిగా ఈ సినిమా క్రేజ్ తగ్గుతోంది అని సీనియా వర్గాల నుండి వినికిడి. ఇందుకు యంగ్ హీరో సిద్దు కూడా ఒక కారణం అని టాక్. అది ఏ విధంగా ఎందుకు అన్నది ఇపుడు తెలుసుకుందాం పదండి.

"డీజే టిల్లు" నిజానికి ఇది చిన్న సినిమానే, కానీ మొదటి నుండి  సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఈ మూవీ పై అంచనాలను పెంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు ప్రధాన పాత్ర పోషించాడు. ఇక నేడు ఈ సినిమా  థియేటర్లలో రిలీజ్ అయిన విషయం వితమే. అలా రిలీజ్ అయ్యిందో లేదో యూత్ ఈ మూవీ చూడడానికి క్యూలలో బారులు తీరుతున్నారు.  బుకింగ్స్ కూడా భారీగానే  జరిగాయి 'ఖిలాడి' వంటి పెద్ద చిత్రం ఉన్నప్పటికీ 'డిజె టిల్లు' కి ఈ రేంజ్లో బుకింగ్స్ జరగడం అదీకాక ఎక్కువ మంది ఈ మూవీ థియేటర్ల వైపే నడవడం  అంటే మాములు విషయమేమీ కాదు.

ఇక ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా ఇపుడు రిలీజ్ అయ్యాక కూడా అదే జోష్ కొనసాగిస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తో రచ్చ రచ్చ చేస్తుండడంతో ఖిలాడీ మూవీ కన్నా కూడా ఈ సినిమాకే ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. అలా ఈ చిత్ర పాజిటివ్ టాక్ కాస్త రవితేజ చిత్రానికి హైప్ తగ్గించింది అంటున్నారు. అయితే ఖిలాడీ పై పెట్టుకున్న నమ్మకం అంతా బూడిదపాలైనట్టే అంటున్నారు సినీ పరిశ్రమ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: