బెల్లం కొండ శ్రీనివాస్ తో రాక్షసుడు సినిమా తీసి హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి ఇంకా మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ఖిలాడి సినిమా ఇక ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది.ఇక రవి తేజ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కాని సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజు 4 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఈ సినిమా కలెక్షన్లను సాధించగా ఈ సినిమాకు పోటీగా నిన్న విడుదలైన డీజే టిల్లు సినిమాకు మాత్రం ఇది వరకు ఊహించిన విధంగా మాంచి పాజిటివ్ టాక్ అనేది వచ్చింది.ఇక నైజాం ఏరియాలో తొలిరోజే ఈ డీజే టిల్లు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించి పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అనేది ఇక సులువుగా అర్థం చేసుకోవచ్చు. డీజే టిల్లు సినిమా సక్సెస్ ప్రభావం ఖిలాడి సినిమాపై భారీస్థాయిలో పడే ఛాన్స్ అయితే కూడా ఎంతో పుష్కలంగా ఉంది.

ఇక వీకెండ్ తర్వాత కూడా ఖిలాడీ సినిమా ప్రదర్శితమవుతున్న కొన్ని మెయిన్ థియేటర్లు డీజే టిల్లుకు కేటాయించే అవకాశాలు కూడా బాగా ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం కూడా గమనార్హం. అయితే మాస్ మహారాజా ఖిలాడి సినిమా నిరాశపరచడానికి ఓ బలమైన కారణం అనేది ఇక్కడ వుంది. అదే మాస్ జోనర్. మాస్ మహారాజాగా రవి తేజా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాని అదే టాగ్ ఇప్పుడు ఈయనకు మైనస్ అవుతుంది. ఖిలాడిలో అనేక ట్విస్ట్ లతో పాటు మాస్ అంశాలు కూడా ఉండటంతో ప్రేక్షకులకు రవి తేజా యాక్టింగ్ రొటీన్ గా అనిపించింది. అందువల్ల ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇక రవి వరుస హిట్లు కావాలంటే సినిమా సినిమాకి జోనర్ అనేది మారుస్తూ ఉండాలి. అలా అయితేనే మాస్ రాజా రవి తేజా సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: