బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నుంచి వచ్చే సినిమాలు హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ వివాదాస్పద సినిమాలు చేస్తున్నాయి. వారు చేసే సినిమాలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎన్నో రకాల అభ్యంతరమైన విమర్శలు వస్తున్నాయి. వారు కావాలనే ఇలా టార్గెట్ చేస్తున్నారు. కావాలనే సినిమాలో అలాంటి సీన్స్ చేస్తున్నారంటూ గతంలో చాలా మంది హిందీ ఫిలిం మేకర్స్ పై ఆరోపణలు విమర్శలు చేశారు. అలా ఓ రెండు వెబ్ సిరీస్ లలో హిందూ దేవతలను కించపరిచారని బిజెపి నాయకులు మరియు హిందువులు మండిపడ్డారు .


తాండవ్ అనే వెబ్ సెరీస్ ఎన్నో విమర్శలు ఎదుర్కోగా  ఆశ్రమ్ అనే మరో వెబ్ సిరీస్ పై కూడా అలాంటి వివాదం చెలరేగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా సన్నివేశాలు పెట్టాలని వారు విమర్శలు చేశారు. ఇంకా పీకే వంటి కొన్ని సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇలాంటి విమర్శలు ఎక్కువగా బాలీవుడ్ ఫిలిమ్స్ పైనే వస్తూ ఉండడం ఇప్పుడు దాని గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందూయిజం కు పూర్తి వ్యతిరేకంగా ఉత్తరాదిన సినిమాలు తెరకెక్కుతు ఉంటే దక్షిణాది సినిమాలు మాత్రం హిందూ దేవుళ్లను సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడానికి కృషి చేస్తున్నట్లు చెప్తున్నారు 

భారతదేశంలోని మరొక భాగమైన ఉత్తరాదిన మాత్రం ఇలాంటి సినిమాలు రావడం ఏంటి అని వారిపై విమర్శలు చేస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకులు సైతం దక్షిణాది సినిమాల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దక్షిణాది సినిమా లు సూపర్ అన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంటుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఉత్తరాదిన సైతం ఆకర్షిస్తుంది. హిందూ దేవుళ్ళు దేవాలయాల పరిరక్షణ సంస్కృతి సంప్రదాయాల గురించి ఈ సినిమాలో ఎంతో గొప్పగా చెప్పారేంజ్ ప్రశంసించారు. ఓ టీ టీ లోకి వెళ్ళిన తరువాత ఈ సినిమాను అక్కడి వారు ఎక్కువగా ఆదరించారు. ఇప్పుడు హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పెద్ద ఎత్తున వీరు ను చూసి వారు నేర్చుకోవాలి.. ఇకనైనా అటువంటి సినిమాలను చేయకుండా చూసుకుంటారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: