స్టార్ హీరోయిన్  గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె ఇంతవరకు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా లో కలసి  నటించలేదు. కానీ పెళ్లి తర్వాత వీరిద్దరి పెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయింది. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈమె నటించిన సూర్యవంశం సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టి కత్రినా కైఫ్ కు మరింత పేరు తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్పోర్టులో కనిపించింది. కొంచెం మనం దీర్ఘంగా చూస్తే ఈమె గర్భవతి అన్న విషయం తెలుస్తోంది. ఇకపోతే నిజంగానే కత్రినాకైఫ్ ప్రెగ్నెంట్ ఆ అనే కోణం లో అభిమానులు కూడా ఆరా తీయడం మొదలు పెట్టారు.నిజానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కత్రినాకైఫ్ అలాగే విక్కీ కౌశల్ ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారు. అంతే కాదు వీళ్ళిద్దరూ సీక్రెట్ గా తమ లవ్ ని మెయింటైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే 2021 న్యూ ఇయర్ పార్టీ ని కూడా వీళ్ళిద్దరూ కలిసి చేసుకోవడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగిపోయాయి. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక తాజాగా కత్రినాకైఫ్ గర్భవతి అంటూ కొన్ని ఫోటోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. అంతే కాదు కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ భార్య భర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన తర్వాత ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే పెళ్లి తర్వాత కూడా వీరికి కొన్ని కమిట్మెంట్ ఉండడం వల్ల రీసెంట్గా ఈ జంట హనీమూన్ కి వెళ్లి అక్కడ కొన్ని ఫోటోలను అభిమానులతో ఇద్దరు షేర్ చేసుకోవడం గమనార్హం. ఇక ఈమె స్వయంగా తాను ప్రెగ్నెంట్ ఆ కాదా అనే విషయం తెలిపే వరకు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: