బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీఖాన్ కూతురిగా కాకుండా తనకంటూ సొంత ఐడెంటిటీ తెప్పించుకునేందుకు బాగా ప్రయత్నించింది.


రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ మాదిరిగానే సారా సైతం స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం కూడా తగ్గడం లేదు. . అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.’కేదర్‌నాధ్’ అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా.. అయితే ఆ సినిమా పెద్దగా అయితే ఆకట్టుకోలేదు.


అయితే…ఆ తర్వాత వచ్చిన ‘సింబా’లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపిస్తూ గ్లామర్ తో కవ్విస్తూనే ఉంటుంది సారా అలీ ఖాన్. తాజాగా గ్లామరస్ లుక్స్ బయటపడే డ్రెస్సులో అదరగొట్టింది. విరహావేదనలో ఉన్నట్టు కన్పించిందిగా సారా. పటౌడీ ప్రిన్సెస్ నీ పరధ్యానానికి కారణమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 34 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు  కూడా తప్పించుకోలేకున్నారు.




సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కూడా కోడై కూస్తోంది.సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. నటిగా మారాలని డిసైడ్ అయ్యాక బరువు తగ్గడం కోసం ఎంతగానో కష్టపడింది. వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది. ప్రస్తుతం ఆమె నాజూకు అందాలకు కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు. సోషల్ మీడియాలో సారా చేసే రచ్చకు సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: