టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పుడూ వరస మూవీ లలో నటిస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో బంగార్రాజు మూవీ తో ప్రేక్షకులను అలరించిన నాగ చైతన్య ఆ తర్వాత థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. అలాగే తాజాగా విడుదల అయిన హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డా లో కూడా నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించిన నాగ చైతన్య ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

అలాగే తమిళ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ నాగ చైతన్య కు 22వ సినిమా. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుంచి మొదలు పెట్టనున్నట్లు నిన్న చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి ఇళయరాజా , యువన శంకర్రాజ సంగీతం అందించనున్నారు. బంగార్రాజు మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఈ మూవీ లో కూడా నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య మరి కొన్ని రోజుల్లో పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ స్పీడ్ ని చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: