టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలు ఫేడ్ అవుట్ అయిపోవడంతో ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమంలోని హీరోలు సినిమాలలో రాణించలేకపోతే సీరియల్స్ లో చేసి అక్కడ ప్రేక్షకులలో అలరించేవారు కానీ ఇప్పుడు సరికొత్తగా మన హీరోలు చేస్తూ ఉండటం విశేషం. ఇటీవల ఓటీటీ లకు ఎంతటి డిమాండ్ ఏర్పడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ధియేటర్లను వెళ్లడం మానుకొని మరి ఓటీటీ లో సినిమాలు చేస్తున్న ఈ రోజులలో మన టాలీవుడ్ హీరోలు కొంతమంది ఓటీటీ లో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొంతమంది అగ్ర హీరోలు కూడా ఈ ఓటీటీ లలో చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు అందుకొని తెలుగులో పలు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నవీన్ చంద్ర ఓటిటిలో స్టార్ హీరోగా మారిపోయాడు చాలా సినిమాలలో ఆయన కనిపిస్తూ అక్కడ బిజీగా బిజీ నటుడుగా మారిపోయాడు.

సినిమా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో ఆయన ఈ విధంగా రూట్ మార్చి ఓటిటి సినిమాలు చేయడం విశేషం. ఆయన తర్వాత నవదీప్ శివ బాలాజీ వంటి హీరోలు కూడా ఓటీటీ లో సినిమాలను చేస్తున్నారు అక్కడ వారికి మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని చెప్పాలి. తాజాగా రాజ్ తరుణ్ కూడా ఓటీటీ లో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవల ఆహ నా పెళ్ళంట అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఏదేమైనా వెండితెరపై రాణించలేని హీరోలకు ఓటీటీ ఒక ప్రత్యామ్నాయం అవుతుంది అని చెప్పాలి. వీరు మాత్రమే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఓటీటీ లో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ రానా ఇద్దరు కూడా ఓ ప్రముఖ ఓటీపీ సంస్థకు భారీ వెబ్ సిరీస్ చేయగా మరి కొంతమంది హీరోలు కూడా ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: