ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది..అలాగే కొద్ది రోజులు కలిసి ఉండి చివరికి విడిపోతున్నవారి సంఖ్య కూడా ఇండస్ట్రీలో ఎక్కువ అవుతుంది.మొన్న సామ్ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు మరో జంట విడి పొతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..రీజన్స్ ఏంటో తెలియదు కానీ చూడ చక్కగా ఉన్న ముద్దు జంటలు అన్ని పెళ్లి మూడ్ ని అనుభవించకుండానే విడాకులు తీసుకొని వేరువేరుగా జీవిస్తున్నారు.అయితే కేవలం యంగ్ కపుల్స్ నే విడాకులు తీసుకుంటున్నారా అంటే నో అని చెప్పాలి. సీనియర్ హీరో , హీరోయిన్స్ కూడా పెళ్లయిన 15 ఏళ్లు పదహారేళ్ళకు విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఆ లిస్టులోకి ఎంతోమంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఆడ్ అయ్యారు. కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాళ్లు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. హీరో రన్వీర్ సింగ్ . ఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇన్నాళ్లయిన గుడ్ న్యూస్ చెప్పకపోవడానికి వెనుక రీజన్ అదే అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది . కాగా ఈ మధ్యనే రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీతో ఎంత రచ్చ లేపాడో మనకు తెలిసిందే..


అంతకు ముందు బాగానే ఉన్న స్టార్ జంట కు రన్వీర్ న్యూడ్ ఫోటోగ్రఫీ తర్వాత దీపిక తల్లిదండ్రులు ఆయనను దూరం పెట్టారట. ఇదే క్రమంలో అమ్మ దీపిక బ్రెయిన్ వాష్ చేసి అతడికి విడాకులు ఇచ్చేలా మార్చేసిందని.. దీంతో దీపికా పదుకొనే రన్వీర్ కు దూరంగా ఉందని.. ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతే కాదు వాళ్ళ ఇంట్లో పని చేసే పనిమనిషి కూడా ఇదే న్యూస్ ని ఫ్రెండ్స్ కి కన్ఫామ్ చేసినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఏది ఏమైనా సరే స్టార్ జంట దీపిక -రన్వీర్ విడిపోతున్నారు అంటే బాధగా అనిపిస్తుంది అంటున్నారు ఫాన్స్. దీనిపై వాళ్ళు స్పందించి ఫ్యాన్స్ అసలు నిజం చెబుతారో లేదో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: