
ఇలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక ఊపు ఊపి ఇక తక్కువ సమయంలోనే కనుమరుగైన హీరోయిన్లలో శ్వేతా బసు ప్రసాద్ కూడా ఉన్నారు అని చెప్పాలి. అప్పుడు వరకు శ్వేత బసు హీరోయిన్ అని ఎవరికీ తెలియదు . చేసిన కొత్త బంగారులోకం అనే సినిమాతో మాత్రం ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఎంతో క్యూట్గా డైలాగ్స్ చెబుతూ కుర్రకారు మతి పోగొట్టింది. దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. అడపాదడపు అవకాశాలు వచ్చిన ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు లేక కనుమరుగయింది అని చెప్పాలి.
దీంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి భిన్నమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవల వచ్చిన ఇండియన్ లాక్ డౌన్ సినిమాలో ఏకంగా సెక్స్ వర్కర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల తాను చేసిన సెక్స్ వర్కర్ పాత్ర గురించి మాట్లాడుతూ ఒకవేళ టెర్రరిస్టు పాత్ర చేయాల్సి వచ్చినా చేసేందుకు తాను సిగ్గుపడని చెప్పింది. ఎందుకంటే నటిగా అని పాత్రలు చేయాలని నా కల అంటూ తెలిపింది. ఇక కరోనా వైరస్ సమయంలో తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కెరీర్ ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంటున్న ఎందుకొ సరైన గుర్తింపు మాత్రం సొంతం చేసుకోలేకపోతుంది శ్వేతా బసు ప్రసాద్.