చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులో ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే అందరి అగ్ర హీరోలతో కలిసి నటించిన సమంత తన నటనతో మరింతగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇకపోతే అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. కానీ నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం పెద్ద ఎత్తున సంచలనాలకు దారితీసింది.

విడాకుల సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత అయినా కూడా భయపడకుండా తనను తాను మరింత ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా బాలీవుడ్,  హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.  ఇటీవల ఈమె నటించిన యశోద సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చింది.  సరోగసి కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సంపాదించింది అంతేకాదు సమంత ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో సినిమాను మరొక రేంజ్ కి తీసుకెళ్ళింది అని చెప్పడంలో సందేహం లేదు.  యాక్షన్ సన్నివేశాలలో కూడా హీరోలతో పోటీపడి మరీ నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా సమయంలోనే తాను మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నాను అని అభిమానులతో తెలియజేసింది.

అయితే కొన్ని రోజుల తర్వాత సమస్య సద్దుమణిగింది త్వరలోనే షూటింగ్లో పాల్గొంటుంది అని అనుకునే లోపే.. ఆ సమస్య ఆమెను మరింతగా బాదిస్తోందట.  ఆ సమస్య తగ్గకపోవడంతో ప్రస్తుతం దక్షిణ కొరియాకు ట్రీట్మెంట్ కోసం వెళ్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బాలీవుడ్లో రస్సో బ్రదర్స్ సిటాడేల్ మూవీ నుంచి సమంత తప్పుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  బాలీవుడ్లో భారీ బడ్జెట్లో తెరకెక్కపోతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్,  సమంత జంటగా నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది.  ప్రస్తుతం తన అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని సమంత ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: