
ఈ సినిమాలోని పాటలు బాగా హిట్ అయ్యాయి. సోషల్ మీడియా అలాగే బయట ఎక్కడ చూసినా సరే ఈ పాటలే వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఫలితంగా మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. రెండవ రోజు కూడా ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు ఈ సినిమా ఎంత వసూలను రాబట్టింది అనే విషయానికి వస్తే..
నైజాం - రూ.3.72 కోట్లు
సీడెడ్ - రూ.1.34 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.1.00 కోట్లు
ఈస్ట్ - రూ.0.44 కోట్లు
వెస్ట్ - రూ.0.40 కోట్లు
నెల్లూరు - రూ.0.25 కోట్లు
గుంటూరు - రూ.0.59 కోట్లు
కృష్ణ - రూ.0.45 కోట్లు
మొత్తం.. రూ.8.19 కోట్లు
ఓవర్సీస్ - రూ.0.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.65 కోట్లు
వరల్డ్ వైడ్ - రూ.9.44 కోట్లు..
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి రూ.19 కోట్లు. రెండు రోజుల్లోనే దాదాపుగా రూ.20 కోట్లకు దగ్గరగా వచ్చింది. మూడవరోజు క్రిస్మస్ కావడంతో నిన్న కూడా మరో నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూలు అయినట్లు సమాచారం. అలా మూడు రోజుల్లోనే 85% రికవరీ చేసిన ఈ చిత్రం ఐదవ రోజు కల్లా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిత్రం యూనిట్ మొత్తానికి అయితే ఈ సినిమాతో భారీ విజయాన్ని రవితేజ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు.