టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అక్కినేని అఖిల్ .హీరో గానే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అంతటి సక్సెస్ ని మరి సినిమాతో అందుకోలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాతో మళ్లీ మన ముందుకు రానున్నాడు అక్కినేని అఖిల్. ఇక ఈయన దర్శకత్వంలో ఈ సినిమా మొదలుపెట్టి చాలా రోజులు అవుతుంది. సినిమా మొదలు పెట్టి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదో ఒక కారణంగా ఆలస్యం అవుతూనే వస్తుంది. 

ఇక అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది .కానీ కొన్ని కారణాలవల్ల   సమ్మర్ కి వాయిదా పడింది .తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం. స్పై థ్రిల్లర్ జూనియర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆ వీడియోని చూస్తేనే అర్థమవుతుంది .ఇక ఈ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు .ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా పూర్తయింది. ఇందులో భాగంగానే విదేశాల్లో ఒక షెడ్యూల్ను ప్లాన్ చేశారట చిత్ర బృందం అక్కడి ఈ సినిమాలోని ఒక ఫైట్ సీన్ ను చిత్రీకరించనున్నారట.

ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం అంతా కూడా ఆ సీన్ కోసం ఫారెన్ వెళ్ళనున్నారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ తో ఏజెంట్ సినిమాకి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా అఖిల్ తన రూపాన్ని మార్చుకున్నాడు .అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నాడు అఖిల్. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఒక ప్రత్యేక వీడియోను చూసిన వారందరూ ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాని మొదట సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వేసవికి విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఏప్రిల్ 20 8న వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: