
అంతలా నెగిటివ్ రోల్స్ లో తన నటనతో మెప్పిస్తూ ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. అంతేకాదు ఇక స్టార్ హీరోలను ఢీకొట్టే పవర్ఫుల్ పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ సాధారణంగా అయితే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందింది.
కానీ కోలీవుడ్ లో కంటే ఇక టాలీవుడ్ లోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇటీవలే కోలీవుడ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనలాంటి ప్రతిభ కలిగిన ఎంతో మంది నటీనటులకు తమిళ ఇండస్ట్రీ లో ఆదరణ దక్కడం లేదు అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. కానీ టాలీవుడ్ లో మాత్రం తనకు మంచి ఆదరణ ఉందని.. అందుకే మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆలోచనల్లో ఉన్నాను అంటూ మనసులో మాట బయట పెట్టేసింది.