
మైత్రి మేకర్స్ బ్యానర్ లో బుచ్చి బాబుతో చరణ్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు. అయితే చరణ్ తో సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులు కావొస్తున్నా ఇంతవరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో భారీ సినిమా ఒకటి చేస్తున్నాడు. ఆర్సీ 15 సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రాబోతుంది. ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమా చేయబోతున్నాడు చరణ్. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ తో మెగా హీరో పెద్ద రిస్క్ చేస్తున్నాడని చెప్పొచ్చు.
చరణ్ సినిమాల ప్లానింగ్ మిగతా హీరోలకు షాక్ ఇస్తుంది. తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ సినిమాలు ఫుల్ కిక్ ఇస్తాయని చెప్పొచ్చు. ఆర్సీ 15 తర్వాత ఆర్సీ 16 కూడా అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు. అయితే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా ఫీల్ అవుతున్నారు. శంకర్ డైరెక్షన్ లో సినిమా పూర్తి కాగానే చరణ్ ఇక పూర్తిగా బుచ్చి బాబు సినిమా మీద వర్క్ అవుట్ చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబందించిన కథ మొత్తం పూర్తి చేసే పనిలోనే ఉన్నాడని టాక్.