ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2  సినిమా కోసం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతలా ఎదురుచూస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .పుష్ప సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా పార్ట్ 2 కోసం అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమా ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు చిత్ర బృందం. ఇక పుష్పాటూ సినిమా మొత్తం కూడా అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాసిల్ మధ్యనే వార్ ఉంటుంది అన్నది పుష్ప వన్ లోనే అర్థమయింది. 

కానీ ఈ సినిమాలో మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది అన్న విషయం ఇప్పటికే తెలుస్తోంది .అయితే తాజాగా పుష్ప టు సినిమాకి సంబంధించిన ఒక కొత్త వార్త ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతుంది. అదేంటి అంటే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిని కలిసి కథ నరేట్ చేయడం జరిగిందట. ఆమె పాత్ర ఎలా ఉంటుందో కూడా చెప్పాడట సుకుమార్.

ఎన్ని రోజుల నుండి సాయి పల్లవి ఎలాంటి పాత్ర కోసమైతే ఎదురు చూస్తుందో అలాంటి పాత్రే తనకి రావడంతో వెంటనే ఆలోచించకుండా సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయిపల్లవిది కాస్త నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఈమె గొప్ప డాన్సర్ కూడా.. హీరోని డామినేట్ చేసే పాత్రలు ఇస్తే ఆమె అల్లు అర్జున్ ని కూడా డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్త తెలిసిన సాయి పల్లవి అభిమానులు సాయి పల్లవి తో నటించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి అంటూ అల్లు అర్జున్ ని హెచ్చరిస్తున్నారు కూడా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: