ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీల కాలం నడుస్తూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే పెరిగిపోయిన టెక్నాలజీతో ఎంతోమంది దేవుడు ఇచ్చిన రూపాన్ని కాదు ఇక తమకు నచ్చినట్లుగా రూపురేఖలను మార్చుకోగలుగుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అనే టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతోమంది తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే కాలంలో సినీ సెలబ్రెటీలు మాత్రమే కాదు ఎంతో మంది సంపన్నులు సైతం ఇలా ప్లాస్టిక్ సర్జరీల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం.


 కేవలం ముఖానికి మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కాదు బాడిలో ఉన్న అన్ని భాగాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తమకు నచ్చిన విధంగా మార్చుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక సినీ సెలబ్రిటీలు అయితే ఇలా ప్లాస్టిక్ సర్జరీ ల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. తమ కెరియర్ డౌన్ కాకుండా ఉండేందుకు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అభిమానులను అలరించి వరుస అవకాశాలు అందుకుంటున్నారు.


 తాను కూడా ఇలాగే  సర్జరీ చేయించుకున్నాను అంటూ ఓపెన్ అయింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నాను అన్న విషయాన్ని ఆటో బయోగ్రఫీ అయినా అన్ ఫినిష్డ్ లో తెలిపింది అని చెప్పాలి. డాక్టర్ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేసి కట్టు తీసినప్పుడు చాలా భయమేసింది. అద్దంలో నా మొఖం చూసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యాను. మా అమ్మ కూడా నన్ను చూసి షాక్ అయింది. అయితే ఒరిజినల్ ముక్కు ఆకారం మారిపోవడంతో ఇక ముఖం మొత్తం మారిపోయింది.  ఆ షాక్ నుంచి బయట పడేందుకు నాకు కొంతకాలం సమయం పట్టింది అంటూ ప్రియాంక చోప్రా తెలిపింది. కాగా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ .

మరింత సమాచారం తెలుసుకోండి: