లోక నాయకుడు కమల్ హాసన్ కొంత కాలం క్రితమే టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా ... ఫాహధ్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు.

సూర్య ఈ మూవీ లో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించినప్పటికీ ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించాడు. ఈ మూవీ తో కమల్ హాసన్ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇలా విక్రమ్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగి పోయింది. కొన్ని రోజుల క్రితమే తిరిగి ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ చెన్నైలోని శివార్లలో జరుగుతుంది. ఇది తెలుసుకున్న అభిమానులు ఇండియన్ 2 షూటింగ్ సెట్ వద్దకు వందలాదిగా తరలి వచ్చారు. ఈ క్రమంలో కమల్ హాసన్ సెట్ వద్ద అభిమానులకు అభివాదం చేశారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: