ప్రస్తుతం హాలీవుడ్ మొత్తం మన ఇండియన్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' గురించి మాట్లాడుకుంటుంది. ఆస్కార్ పుణ్యమా అని సినిమా పేరు అలాగే రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పేర్లు మార్మోగిపోతున్నాయి. ఈ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్తుందని ఎవరు ఊహించలేకపోయారు. కానీ దాన్ని సుసాధ్యం చేసి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక మూవీ టీం కూడా ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డారు. అయితే మొదటి నుంచి ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అంటూ చాలామంది ఇప్పటికే నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా అన్నవాళ్ళందరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కానీ ఇటు రాజమౌళి అటు రాంచరణ్ మాత్రం ఇద్దరూ సమానమే అని చెప్పారు. ఇక హాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తున్న సమయంలో ఓ హాలీవుడ్ రిపోర్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ది ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వేణు స్వామి మీద ఇప్పుడు ఫాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మా హీరోని సైడ్ క్యారెక్టర్ అంటావా అంటూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేణు స్వామి భారీ ట్రోలింగ్ గురవుతున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేణు స్వామి మీద రకరకాల పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్రామ్ సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: