
దాదాపుగా గడిచిన ఒక సంవత్సరం నుంచి ఓటీటి ల హవా బాగానే తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మంచి షోలు కూడా జనాలలో వెళ్లేందుకు పెద్దగా టాక్ తెచ్చుకోలేక పోతున్నాయి.. ఏదైనా సూపర్ డూపర్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు వాటిని చూడడానికి పెద్దగా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కానీ గతంలో మాత్రం కనిపించే ఆకర్షణీయమైన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటి లలో కనిపించలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు వాటికి పెయిడ్ చార్జీలు కూడా చేయడం తో ప్రేక్షకులు కొంతమంది విసిగిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో 50% ప్రేక్షకులు చూసే వారి సంఖ్య తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ చిన్న చిన్న సినిమాలకు మాత్రం ఓటీటి ప్లాట్ ఫామ్ లో బెస్ట్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఓటీటి లకు కూడా సెన్సార్ ఉండాలనే విషయం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఒక వేళ ఇదే కనుక జరిగితే ఇక రాబోయే రోజుల్లో ఓటీటి ల హవా మరింత తగ్గిపోయే అవకాశం ఉందని ఓటిటి చూసే ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఓటీటి లు బెస్ట్ గా అనిపిస్తున్నట్లు తెలుస్తోంది.