
వాస్తవానికి మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీతో సంబంధం లేనట్టుగా ఆయన ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్నటికి నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపకపోవడం మరింత చర్చకు దారితీసింది. అల్లు అర్జున్ కావాలనే రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదని గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ని చూసి బన్నీ కుళ్ళు కుంటున్నాడని మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
హైదరాబాదులో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి ఇచ్చిన బర్త్డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో మరింత విమర్శలకు తావిచ్చినట్లు అయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య చిరంజీవి ఈరోజు చేసిన ఒక ట్వీట్ మళ్లీ చర్చ కేంద్ర బిందువు అయిందని చెప్పాలి. చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా .." ప్రియమైన బన్నీకి నువ్వు సినిమాలలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది . నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా నా మదిలో పదిలంగా ఉన్నాయి. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియడం లేదు . గూటిలో ఉన్న పక్షి స్థాయి నుంచి నువ్వు పాన్ ఇండియా స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగిన తీరు చూస్తుంటే చాలా సంతోషంగా.. గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది మనసులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ చిరంజీవి ఒక ట్వీట్ చేయడం తో.. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. " మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు.. నా మనసులో మీ మీద ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుంది.. థాంక్యూ చికబాబి" అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.