సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ అందం అభినయంతో ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారూ అని చెప్పాలి. ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో మీరాజాస్మిన్ కూడా ఒకరు అని చెప్పాలి.


 ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు హవా నడిపించింది. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి అభిమానులు అందరికీ కూడా ఇచ్చింది అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ మలయాళ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది మీరాజాస్మిన్. అయితే సినీ కెరియర్ సాఫీగా సాగిపోయినప్పటికీ మీరా జాస్మిన్ పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది అని చెప్పాలి. క్రిస్టియన్ అయినా మీరా జాస్మిన్ కేరళలోనే ఒక హిందువుల గుడిలో అందరికీ ప్రవేశం కల్పించాలంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి పదివేల రూపాయల జరిమానా కట్టే పరిస్థితిని కొని తెచ్చుకుంది. అంతేకాదు ఇక డబ్బు కోసం 8 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తిని పక్కకు పెట్టి మరి రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని మార్చుకొని ఉదయమే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సంగీత విధ్వంసుడు అయిన మాండో లీన్ రాజేష్ అనే వ్యక్తితో దాదాపు 8 ఏళ్ల పాటు సహజీవనం చేసింది మీరాజాస్మిన్. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని అభిమానులు అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత డబ్బు కోసం రాజేష్ నువ్వు వదిలేసి ఒంటరిగా ఉంటున్న రెండో పెళ్లి వాడైన అమెరికాకు చెందిన అనిల్ జాన్ ని పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం  భర్తకు విడాకులు ఇచ్చింది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: