తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఒక్క సినీమా తో కేవలం ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎంతోమంది హీరోయిన్స్ సైతం స్టార్ పొజిషన్ లోకి చేరుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ సైతం నటించిన చిత్రాలలో యూఎస్ఏ లో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


హీరోయిన్ కీర్తి సురేష్ తన కెరియర్ లోనే నటించిన సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో 4 సినిమాలు  కలెక్షన్లు సాధించింది.. ఆ తర్వాత హీరోయిన్ తమన్నా కూడా తను నటించిన సినిమాలలో 4 సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో కలెక్షన్లు రాబడ్డాయి. ఆ తర్వాత స్థానంలో రష్మిక 3 సినిమాలు పూజా హెగ్డే 3 సినిమాలు ఉండగా సమంత ,అనుష్క ,శృతిహాసన్, 2 సినిమాలతో అత్యధికంగా కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే స్టార్ హీరోయినిగా పేరు పొందిన కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ లిస్టులో లేకపోవడంతో కాస్త అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.


ప్రస్తుతం ఇందులోని హీరోయిన్స్ సైతం ఇతర భాషలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక తమ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో పెరిగిపోతూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా  భోళా శంకర్, జైలర్ సినిమాలో నటిస్తోంది. రష్మిక పుష్ప-2 లో, సమంత శాకుంతలం, అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా నటిస్తోంది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో యూఎస్ఏ లో అత్యధికంగా కలెక్షన్లు రాపడతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: