సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారని తెలుస్తుంది.. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి కూడా సమంత స్పందించారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మాత్రం సమంత చేసిన సంగతి మనకు తెలిసిందే. ఉ అంటావా మామ ఊ..ఊ అంటావా మామ అనే పాట ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు బాగా తెలిసిందే. ఈ పాట ద్వారా సమంత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు కూడా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇందులో కూడా సమంతనే చేయబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత సంగతి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఈ విషయం గురించి సమంతను ప్రశ్నించగా ఈమె మాట్లాడుతూ మీరు అనుకున్నట్టు తాను ఎలాంటి స్పెషల్ సాంగ్స్ ను చేయలేదని క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇలా సమంత పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయట్లేదు అని చెప్పడంతో అభిమానులు కొద్దిగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సమంత ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: