టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ అని.. షూటింగ్స్ అని బిజీ బిజీగా తిరుగుతుంది. మరి ఇంత బిజీగా ఉన్న సమంత ఈ ఏప్రిల్ 28న తన పుట్టినరోజును జరుపుకోబోతోంది. ఈ ఏడాదితో సమంతకు 36 ఏళ్ళు నిండుతాయి. ఇంతకీ ఈ ఏడాది సమంత తన బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది? అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. ప్రస్తుతం సిడాటేల్ అనే వెబ్ సిరీస్ కొత్త షెడ్యూల్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఓవైపు హెల్త్ ఇష్యూస్ ఉన్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సమంత ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది. 

అయితే గత ఏడాది సమంతా పుట్టినరోజు వేడుకలు షూటింగ్లోనే జరిగాయి. తన బర్త్ డే టైం కి లాస్ట్ ఇయర్ కాశ్మీర్లో ఖుషి షూటింగ్లో ఉంది సమంత. ఖుషి మూవీ టీమ్ అంతా కలిసి ఓ సర్ ప్రైజ్ బర్త్ డే ట్రీట్ ని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే టీమ్ అంతా ఓ సీన్ ని ప్లాన్ చేశారు. అది నిజమైన సన్నివేశం అనుకొని సమంత యాక్ట్ చేసింది. తీరా చూస్తే అది ప్రాంక్. సమంత బర్త్ డే కి విషెస్ చెప్పడం కోసమే మూవీ టీమ్ అంతా అలా ప్లాన్ చేశారు.ఇక ఆ సర్ప్రైజ్ తో సమంత ఎంతో ఎమోషనల్ అయింది. అయితే ఈ ఏడాది సిడాటెల్ టీం రాజ్ అండ్ డి కె, వరుణ్ దవన్ కలిసి సమంతకు బర్త్ డే సర్ప్రైజ్ని ప్లాన్ చేయబోతున్నారట. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అంటున్నారు.

మొత్తానికి లాస్ట్ ఇయర్ ఖుషి మూవీ సెట్స్ లో తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్న సామ్.. ఈ ఇయర్ సిడాటేల్ టీం తో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతోందన్న మాట. ఇక ఇటీవల సమంత నటించిన శాకుంతలం మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సమంత ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతానికి తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి 'ఖుషీ' అనే సినిమా చేస్తోంది సమంత. సిడాటెల్  షూటింగ్ కంప్లీట్ అయ్యాక వెంటనే ఖుషి మూవీ షూటింగ్ ని సమంత కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే సమంత మాత్రం ఒకే రోజులో రెండు షూటింగ్స్ కి అటెండ్ అయ్యేలా కాల్ షీట్స్ ను అడ్జస్ట్ చేస్తుందట. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణమూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: