ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ - అనుష్క జంటకు సంబంధించి ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు ఈ జంట కి భారీ క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాల సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ జంట కలిసి మరో సినిమా చేస్తే చూడాలని ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంటను మళ్ళీ తెరపై చూసే సమయం మరింత దూరంలో లేదని ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ బలంగా వినిపిస్తోంది. 

అనుష్క, ప్రభాస్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారట. తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి ఓ అగ్ర దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతానికి ఆ దర్శకుడు వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నా.. ప్రభాస్డైరెక్టర్ ని నమ్మి అవకాశం ఇచ్చాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ చేస్తున్న క్రిష్ జాగర్లమూడి. ఈ దర్శకుడు ప్రభాస్, అనుష్క కాంబో కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అనుష్క హీరోయిన్ గా సినిమాలు బాగా తగ్గించేసింది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది.

ప్రస్తుతానికి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటించేందుకు అనుష్క కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న క్రిష్ ప్రభాస్ కోసం ఒక స్టోరీని రెడీ చేశాడట. ఇటీవల బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రసాద్ లకు ఆ స్టోరీని వినిపించగా.. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మళ్లీ ప్రభాస్, అనుష్క జంటను త్వరలోనే మనం తెరపై చూడబోతున్నాం. ఒక విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: