ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప సినిమానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ అంచనా నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది. వాటితో పాటు ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది.ఇప్పటివరకు సౌత్ ఇండియాలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీకి ఈ సినిమాతో సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా ఫాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పక్క ఊర మాస్ పుష్పరాజు పాత్రలో నటించాడు బన్నీ. ఇక ఈ సినిమాలో బన్నీ నటన ఎంత అత్యద్భుతంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఇంత విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా తెరకెక్కించబోతున్నాడు సుకుమార్. దీంతో పై భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రతో పాటు హైలైట్ అయిన మరో పాత్ర బన్వర్ సింగ్ షెకావత్. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం ఉంటుంది అన్నది సెకండ్ పార్ట్ లో చూడాలి. ఈ సినిమాలోని ఈ పాత్ర లో మలయాళీ నటుడు ఫాహద్ ఫజల్ నటించాడు.

అయితే ఆయన కంటే ముందు ఆ పాత్ర కోసం సౌత్ ని ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోను అనుకున్నారట మేకర్స్. కానీ ఆ పాత్రను ఆయన రిజెక్ట్ చేశారట. అయితే ఈ సినిమాలోనే బన్వర్ సింగ్ శకావత్ పాత్ర కోసం ముందుగా సుకుమార్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అడిగారట. కానీ అప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ సినిమాని వదులుకున్నారట విజయ్ సేతుపతి .దీంతో ఆ పాత్ర కోసం ఫేహాద్ ని ఎంపిక చేశారట. దీంతో ఈ వార్త కాస్తే ఎప్పుడూ సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త విన్న పుష్ప సినిమా అభిమానులు బన్వర్సింగ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించి ఉంటే పుష్ప సినిమా వేరే లెవెల్ లో ఉండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: