
తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అలనాటి యాంకర్ ఝాన్సీ పలు కామెంట్లు చేయడం జరిగింది. ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన జీవితం లో జరిగిన కొన్ని అన్యాయాల గురించి తెలియజేసింది యాంకర్ ఝాన్సీ.. ఒక వెబ్సైట్ వాళ్లు యాంకర్ ఝాన్సీ ని ఫలానా వారితో ఎఫైర్ ఉందని ..పోలీసు రైడ్ లో దొరికిపోయింది అంటూ ఒక రూమర్ను సృష్టించారు.కానీ ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా అబాండాలు వేస్తే వ్యక్తిగతంగా మేము ఎంత భాధ అనుభవిస్తామో వారికి తెలియదంటూ తెలియజేస్తోంది ఝాన్సీ.
ఇలాంటి సంఘటన వల్ల ఒక పదవిని కోల్పోయాను అంటూ తెలియజేసింది .నేను యూనిసెఫ్ కోసం పనిచేశాను.. బాల్యవివాహాల పట్ల అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలను కూడా చేశాను.. దీనికి గుర్తింపుగా యూనిసెఫ్ కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే సమయంలో కొంతమంది ప్రతినిధులు ఇలాంటి వార్తలు రాయడం వల్ల వారు ఆ నిర్ణయాన్ని వారు వెనక్కి తీసుకున్నారని తెలిపింది ఝాన్సీ. ఇలాంటి రూమర్లు వల్ల తనకు రావలసిన పదవి కూడా రాకుండా పోయిందట.యాంకర్ ఝాన్సీ కెరియర్ విషయానికి వస్తే సినిమాలలో కంటే ఇమే కామెడీ పాత్రలలోని ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. ఝాన్సీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాతే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.