
‘రాజకుమారుడు’తో హీరోగా తెలుగుతెరపైకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత ‘యువరాజు’ సినిమా చేశాడు. మొదటది బాక్సాఫీస్ దగ్గర హిట్ కాగా.. రెండో చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన మూడో సినిమా ‘వంశీ’ అట్టర్ ప్లాప్ అయింది. దీంతో ఎలాగైన నాలుగో సినిమా హిట్ కొట్టాలనుకుని.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మురారీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్. ఈ చిత్రాని కి కృష్ణవంశీ దర్శకుడు.
మొదట ఈ చిత్రంతో మహేష్ బాబు కు మరో ఫ్లాప్ ఖాయం అని అందరూ అనుకున్నారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కథను అప్పట్లో వద్దన్నారట. కానీ ‘మురారీ’ కథపై మహేష్ నమ్మకం ఉంచాడు. తొలుత ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం తో కృష్ణ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఫస్ట్ షో కల్లా బుకింగ్స్ భారీగా పెరిగాయి. అలా మాస్ సెంటర్లలో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమా చూసి.. మహేష్ బాబు నటనను మెచ్చుకున్నారట. అలా ‘మురారీ’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత సూపర్ హిట్ గా నిలిచింది.