జూనియర్ ఎన్టీఆర్ rrr చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు.ఈ సినిమా తర్వాత తను నటిస్తున్న చిత్రం ntr -30 ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నటుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉన్నది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. వీరిద్దరూ మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


కేవలం ఈ చిత్రానికి ntr -30 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది .ఈనెల 20వ తారీకున ఎన్టీఆర్ బర్తడే సందర్భంగా ఆ రోజున ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా టైటిల్ కు" దేవర" అనే ఒక పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం వర్గాలలో వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.


సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇటీవలే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.తాజాగా ఈ సినిమా మూడవ షెడ్యూల్ కోసం చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన చెట్లు ఈ సన్నివేశాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది సుమారుగా 10 రోజులపాటు ఈ షెడ్యూల్ జరగబోతున్నట్లు సమాచారం. సంగీతాన్ని అనురుధ్ రవిచందర్ అందిస్తూ ఉన్నారు.. వచ్చి ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. మరి ఈ సినిమాతో డైరెక్టర్ కొరటాల శివ తన మేనియాను చూపిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: