సౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. రెగ్యులర్గా వర్కౌంట్స్ చేస్తూ ఎంతో ఫిట్గా ఉంటుంది. డైలీ తన జీవితంలో జిమ్  తోనే ఎక్కువ సమయం కేటాయిస్తోంది సమంత. 35 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ యంగ్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వయసులో కూడా ఆమె అంత అందంగా కనబడడానికి కారణం వర్కౌట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మయోసైటిస్ బారిన పడి నెమ్మదిగా కోలుకున్న సమంత తాజాగా ఇప్పుడు మళ్ళీ వర్క్ అవుట్ చేయడం మొదలుపెట్టింది. 

ఈ కండరాల వ్యాధి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడిన తర్వాత మళ్లీ ఆమె తన పాత జీవితాన్ని మొదలు పెట్టింది. అనారోగ్యం నుండి కోల్కున్న వెంటనే ఖుషి సినిమా షూటింగ్ పై ఫోకస్ పెట్టింది సమంత. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ సైతం చేసింది సమంత. ఇక అవన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హిందీలో చేస్తున్న వెబ్ సిరీస్ సీటాడేల్ పై తన దృష్టినంతా ఉంచింది. ఇక సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది సమంత. ఇక ఈ వెబ్ సిరీస్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. అందుకు తన బాడీని ఫిట్ గా మార్చే పనిలో ఉంది సమంత. అందుకే హెవీగా వర్కౌట్స్ చేస్తోంది.

దాంతోపాటు ఫైట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన చేస్తున్న వర్కౌట్ కి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం సమంత షేర్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.ఇక ఆ వీడియోలో జిమ్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది సమంత. ఇక సమంత ఎక్ససైజ్ లు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఆమె అభిమానులు. త్వరలోనే సిటా డెల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. హిందీలో ఆయుష్మాన్ ఖురానా తో ఒక సినిమా చేయబోతుంది. ఇక ఆ సినిమాలో సమంత ఒక గోస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: