నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి.పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది.
అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. తాజాగా భూమిక సిగ్గు మోగలేస్తున్నట్లుగా ఉన్న ఫోజుల్లో ఊరిస్తోంది. ఆమె గ్లామర్ మెరుపు ఇంకా తగ్గలేదనే చెప్పాలి. పెదవుల అందంతో కవ్విస్తూ భూమిక చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. ఇటీవల భూమిక గ్లామర్ డోస్ పెంచుతోంది. పొట్టి గౌనుల్లో ఎక్కువగా ఫోటోషూట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తోంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో పెదవుల, లెగ్స్ తో యువతని ఆకర్షిస్తోంది. 44 ఏళ్ళ వయసులో కూడా తన అందం చెక్కు చెదరలేదని చెబుతోంది. వివిధ కాస్ట్యూమ్స్ లో భూమిక మెరిసింది. లాంగ్ గౌన్ లో గింగిరాలు తిరుగుతూ అల్లరి కుర్ర భామలా మురిపిస్తోంది. మరో పొట్టి స్కర్ట్ లో భూమిక ఎద అందాలు, మైండ్ బ్లోయింగ్ చిరునవ్వులతో కుర్రాళ్లలో అలజడి సృష్టిస్తోంది అనే చెప్పాలి.అలాగే తన కొడుకుతో కలసి సమ్మర్ ఓ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని కూడా భూమిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. భూమిక రోజు రోజుకి వయసు తగ్గించి హీరోయిన్లకు పోటీ ఇస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో భూమికకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది.

నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు భూమిక గతంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది. తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: