కొన్ని దశాబ్దాలుగా అంతు చిక్కని రహస్యంగా కొనసాగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ గుట్టు వీడిపోనుందా..? భారీ ఓడల నుంచి విమానాల దాకా క్షణాల్లో అదృశ్యమవడం వెనుక రహస్య బయటపడనుందా..? అంటే శాస్త్రవేత్తల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.


బెర్ముడా ట్రయాంగిల్  వ్యవహరించే ఈ జలాల్లో భారీ అగ్ని పర్వత బిలాలున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తెలుసుకున్నారు.  ఆ ప్రాంతంలో సముద్ర జలాల్లోని మీథేన్ వాయువు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అగ్ని పర్వత బిలాల అడుగు భాగంలోని వాయువులపై ఒత్తిడి కలిగి మీథేన్ వాయువు వెలువడుతుందని.. దీంతో అక్కడ ఏర్పడిన శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు వేగంగా అటువైపు ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో చిన్న పడవల నుంచి భారీ ఓడల వరకు సముద్రంలోకి లాగేసుకున్నట్టు దూసుకుపోతాయని చెబుతున్నారు.


ఫ్లోరిడా తీరం నుంచి నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్యూర్టొరికో వరకు ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ గా పిలుస్తున్నారు. నార్వే తీరాన ఉన్న బేరెంట్స్ సముద్ర గర్భంలో కిలోమీటర్ వెడల్పు, 150 అడుగుల లోతైన క్రేటర్స్ అనేకమున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని సందర్భాల్లో మంచుగడ్డ రూపంలో ఉన్న మీథేన్ గ్యాస్ కూడా తగలబడి పోవడం వల్ల శూన్యం మరింత విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

 అయితే విమానాలు కూలిపోవడానికి కూడా మీథేన్ గ్యాస్ మండిపోవడం వల్ల ఏర్పడిన శూన్యమే కారణమా..? అన్న అంశంపై పూర్తి స్థాయి అధ్యయన్ చేయాల్సి ఉందంటున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలించి బెర్మా ట్రయాంగిల్ మిస్టరీ వీడిపోతే.. ఎన్నో ప్రాణాలు కాపాడొచ్చు. సృష్టిలో మనిషికి అర్థంకాని ఎన్నో రహస్యాలను చేధించే అవకాశం లభించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: