
అందుకు సంబంధించిన అన్నీ పత్రాలను విజయ్ పొందుపరిచారు. కేసు నుంచి విజయ్ కు ఊరట లభించింది.. ఇది ఇలా ఉండగా తాజాగా మరో డైరెక్టర్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ కు మద్రాస్ కోర్టు షాక్ ఇచ్చింది.. ఆదాయానికి సంబందించిన పన్నులు ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసినందికు కోర్టు నోటీసులు జారీచేసింది.ఈ విషయం పై వెంటనే సమాధానం ఇవ్వాలని కోర్టు నోటీసులో పేర్కొన్నారు.
బ్రిటన్‌కు చెందిన టెలికాం కంపెనీకి రింగ్ టోన్లు కంపోజ్ చేసేందుకు రెహమాన్ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం రూ.3.47కోట్ల భారీగా పారితోషకాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన పత్రాలను ఆదాయ పన్ను శాఖకు చూపించకుండా మద్రాసులోని ట్రస్ట్ కు బదీలి చేశారని ఆరోపణలు చేశారు.అంతేకాదు తీసుకున్న ఆదాయానికి పన్నులు చెల్లించక పోవడం నేరమని ఐటీ తరపు న్యాయవాది పేర్కొన్నారు.పన్ను ఎగవేతకు పాల్పడిన రెహమాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకోసం మద్రాస్ హైకోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది..మూడు రోజుల్లో ఈ విషయం పై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.