
కరోనా వైరస్ దేశాన్ని గత ఆరు నెలలుగా టెన్షన్ పెడుతూనే ఉన్నది. ఇక రాజకీయంగా కూడా కరోనా అనేక ఇబ్బందులు కలిగించింది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ పరిపాలన సజావుగా సాగడం లేదు. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు సరికొత్తగా ఒడిశా రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ రజినీకాంత్ సింగ్ తో పాటు 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిందనే వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. త్వరలో ఒడిశాలో వర్షాకాల శాసన సభా సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ నిర్ధారణ పరీక్షల్లో 11 మంది ఎమ్మెల్యేలకు, డిప్యూటీ స్పీకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో వీరిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరి ఇంకా ఎంతమందిని ఈ కరోనా పొట్టనపెట్టుకుంటుందో తెలియడం లేదు. అయితే అధికారిక సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.