
సదస్సు కు హాజరైన భట్టివిక్రమార్క సిఎం కేసిఆర్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.ప్రాజెక్టుల పునర్నిర్మాణం పేరుతో రాష్ట్ర ఖజానాను అక్రమంగా కేసీఆర్ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఎఐసిసి కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. దళితుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేకుండా చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ తెచ్చింది,ఇచ్చింది కాంగ్రెసే అంటూ మరొక సారి గుర్తుచేశారు.
తెలంగాణ కోసం మంత్రులుగా మొదట రాజీనామా చేసింది తామేనని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చెప్పారు..కేసిఆర్ కుటుంబ రాజకీయాలు చెయ్యడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మన ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాపక్షం ఎడిటర్ శ్రీనివాస్, జర్నలిస్టు సంఘం నేతలు పల్లె రవికుమార్, కాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నాని సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలని ఘనంగా నిర్వహించారు...