
కులాల బట్టే నేతలు రాజకీయం ముందుకు తీసుకెళుతున్నారు. ఏ కులానికి ఏం చేస్తే...ఆ కులం ఓట్లు పడతాయని ఆలోచిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్ కుల సమీకరణాలని కరెక్ట్‌గా వాడుకున్నారు. రాజకీయంగా అన్నీ కులాల మద్ధతు ఉండేలా చూసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్తితులు మారుతున్నాయి. నిదానంగా కొన్ని వర్గాలు కేసీఆర్‌కు దూరమవుతున్నాయి. కొన్ని పరిస్తితుల నేపథ్యంలో గిరిజనులు, ఆదివాసీలు కేసీఆర్ ప్రభుత్వానికి దూరమయ్యారు.
అలాగే మాదిగ వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా దూరమయ్యారు. ఇక ఈటల రాజేందర్ ఎఫెక్ట్‌తో ముదిరాజ్‌లు టీఆర్ఎస్‌కి దూరం జరిగారు. అలాగే మున్నూరు కాపులు సైతం టీఆర్ఎస్‌కు దూరం జరుగుతున్నారు. రెడ్డి వర్గం మొదట్లో కాంగ్రెస్‌కు మద్ధతు ఉండేది..వారిని కేసీఆర్ దగ్గర చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వారు దూరమవుతున్నారు. అటు టీడీపీ క్లోజ్ అవ్వడంతో కమ్మ వర్గం సైతం టీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చింది. కానీ ఆ వర్గం కూడా ఇప్పుడు అంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ఇందులో కొన్ని వర్గాలని దగ్గర చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అదే సమయంలో దూరమైన రెడ్డి వర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్‌కు దగ్గర చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అలాగే తనని ఇష్టపడే కమ్మ వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని చూస్తున్నారు. రేవంత్‌కు పిసిసి పగ్గాలు వచ్చాక కమ్మ వర్గం కాస్త కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా రెడ్డి-కమ్మ వర్గం కాంబోని సెట్ చేసుకునే పనిలో రేవంత్ ఉన్నారు.