
హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది ధమ్ బిర్యానీ..ప్యారడైజ్ లో బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. అన్ని రుచులలో ఆ రుచి వెరయా అంటారు.కాగా ఇప్పటికే ఎన్నో రుచులను అందిస్తున్న ఈ రెస్టారెంట్ ఇప్పుడు మరో కొన్ని వంటలను కూడా అందిస్తుంది.ప్యారడైజ్ బిర్యానీ ఫుడ్ లవర్స్ గుడ్‌న్యూస్. ప్రముఖ ప్యారడైజ్ ఫుడ్ కోర్టు తమ ప్రస్తుత మెనూలో సరికొత్త బిర్యానీ, కబాబ్‌లను జోడించినట్లు బుధవారం ప్రకటించింది.
ఫైరీ చికెన్ బిర్యానీ, ఫైరీ చికెన్ కబాబ్ అనే రెండు కొత్త వంటకాలు స్పైసీ ఫుడ్స్ పేరుతో తీసుకొచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ఔట్లెట్లలో ఈ రెండు కొత్త వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఆహార ప్రియులు వెంటనే దగ్గర్లోని ప్యారడైజ్ బిర్యానీ పాయింట్‌కు వెళ్లి ఈ కొత్త వంటకాలను రుచి చూడొచ్చు.
రెండు కొత్త వంటకాలపై ప్యారడైజ్ బిర్యానీ ఎండీ గౌతమ్ గుప్తా మాట్లాడారు. మేం మా మెనూలో కొంత కొత్తదనాన్ని తీసుకురావాలనుకుంటున్నాము. అందుకే.. మేం కొత్త బిర్యానీ, కబాబ్‌తో రావాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా, హలీమ్ సీజన్లో మేం ప్రత్యేకంగా అదనపు మసాలా దినుసులతో వండిన వంటలను కస్టమర్లు ఎంతో ఆనందించారని మా కస్టమర్ బేస్ నుంచి గ్రహించాం. మా చెఫ్ మాస్టర్లు మసాలా దినుసులు జాగ్రత్తగా ఎంచుకొని, సువాసన వచ్చేలా సున్నితంగా వండుతారు. బిర్యానీ, కబాబ్ కస్టమర్లు ఇష్టపడతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.'' అని చెప్పారు.
కొత్త రిసిపిని రుచి చూసేందుకు ఇప్పటికే చాలా మంది బారులు తీరుతున్నారని గుప్తా తెలిపారు.సంవత్సరంలో అత్యధిక బిర్యానీలు వడ్డించినందుకు'' లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్యారడైజ్ ఫుడ్ చైన్ చోటు సంపాదించుకుంది. 2017లో 70 లక్షలకు పైగా బిర్యానీలను అందించగా, 2018లో వాటి సంఖ్య 90 లక్షలకు పైగా చేరింది..హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు 2014 నాటికి 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాటు దేశ వ్యాప్తంగా ప్యారడైజ్ హోటళ్లు ఉన్నాయి.వీటిలో వాడే ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా ఉంటాయి అందుకే వీటికి డిమాండ్ బాగుంది.