యావత్ దేశానికే వివాదాస్పద రాసలీలల స్వామీజి నిత్యానందుడు ఒక్కసారిగా షాకిచ్చాడు. అత్యాచారాలు, లైగింకవేధింపుల కేసుల్లో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిన నిత్యానందుడు దేశం నుండి పారిపోయిన విషయం తెలిసిందే. అక్కడెక్కడో ఈక్వెడార్ దేశానికి దగ్గర్లోని ఓ దీవిలో ప్రత్యక్షమయ్యాడు. తాను నివాసం ఉన్న ప్రాంతానికి కైలాసదేశం అని పేరు కూడా పెట్టాడు. సొంత రాజ్యాంగం, సొంత కరెన్సీ, సొంత చట్టాలు, సొంత న్యాయస్ధానం, విదేశాల్లో రాయబార కార్యాలయాలు అన్నింటినీ ప్రకటించేశాడు.





ఇదంతా విన్న మనవాళ్ళకి నిత్యానందుడికి పిచ్చెక్కిందేమో అనుకున్నారు. కానీ ఇపుడు దేశానికే పిచ్చెక్కించేశాడు. ఎందుకంటే కైలాసదేశాన్ని స్వతంత్రదేశంగా ఐక్య రాజ్యసమితి గుర్తించేసింది. ఏ ప్రాతిపదికన సమితి గుర్తించిందో మాత్రం ఎవరికీ తెలీదు. గుర్తించిందని మాత్రమే తెలుసు. అదికూడా ఎలా తెలుసంటే ఈమధ్యనే సమితి ఆధ్వర్యంలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కైలాసదేశం తరపున మాత విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు.





హాజరవ్వటమే కాకుండా భారతదేశంపై అనేక ఆరోపణలు చేశారు. వందలాది దేశాల ప్రతినిధులు హాజరైన ఆ సమావేశానికి  విజయప్రియ హాజరవ్వటం ఏమిటి ? భారత్ పై ఆరోపణలు చేయటం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. పైగా తమ దేశపు రాజ్యాంగాన్ని, భగవత్ గీత పుస్తకాలను విదేశీ రాయబారులకు, విదేశాల ప్రతినిధులకు పంపిణీచేశారు. విదేశీ జనాలు కూడా విజయప్రియతో ఫొటోలకు ఎగబడ్డారు. హిందువుల కట్టు, బొట్టు, నగల అలంకరణలతో అందరినీ ఆకర్షించింది.





అంటే కైలాసదేశాన్ని భారత్ గుర్తించినా గుర్తించకపోయినా ఐక్య రాజ్యసమితి అయితే గుర్తించేసింది. రేపు ఎప్పుడైనా ఒకే వేదిక మీద నరేంద్రమోడీ పక్కనే నిత్యానందుడు కూర్చున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే భారత్ కు నిత్యానందుడు రావాలని అనుకుంటే కైలాసదేశపు అధినేత హోదాలోనే వస్తారు. అప్పుడు దేశంలోకి అడుగుపెట్టగానే పాతకేసులను తిరగతోడి అరెస్టు చేస్తామంటే కుదరదేమో. ఎందుకంటే నిత్యానందుడిని అరెస్టు చేస్తే అది అంతర్జాతీయ వ్యవహారమై కూర్చుంటుంది. అమెరికా లాంటి దేశాలు నిత్యానందుడి తరపున వకాల్తా పుచ్చుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. మొత్తానికి తన చేష్టలతో దేశం మొత్తానికి నిత్యానందుడు పిచ్చెక్కించేస్తున్నదైతే వాస్తవమే.

మరింత సమాచారం తెలుసుకోండి: