
ఇలా ఒక సారధిగా రోహిత్ శర్మకు వంక పెట్టడానికి ఒక్క కారణం కూడా లేదు అని చెప్పాలి. కానీ ఒక ఆటగాడిగా మాత్రం రోహిత్ శర్మ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో కొనసాగుతున్న రోహిత్ శర్మ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో మినహా ఒక్క మ్యాచ్లో కూడా పెద్ద చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. నెదర్లాండ్స్ తో మ్యాచ్లో కూడా ఎన్నోసార్లు సేవ్ అవడం కారణంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో అతనిపై మాజీలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై మాజీ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సరిగ్గా ఆడటం లేదు. ఐదు మ్యాచ్లలో కలిపి కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండు మ్యాచ్లుగా కాస్త రాణించడం ఊరట కలిగించే అంశం అంటూ హార్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ ఉండడం భారత జట్టుకు ఎంతగానో కలిసి వచ్చే అంశం అని హార్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే సూపర్ 12 మ్యాచ్లలో రాణించక పోయినప్పటికీ ఇక కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ రాణించాలని కోరుకుంటున్నారు అభిమానులు.