ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో ఫీల్డింగ్  ప్రమాణాలు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి అంటే ప్రతి జట్టు కూడా ఫీల్డింగులో ఎప్పటికప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అన్ని జట్లు కూడా బ్యాటింగ్ బౌలింగ్ విషయంలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయో.. ఇక తమ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకునేందుకు కూడా నిరంతరం ప్రాక్టీస్ లో మునిగితేలుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఫీల్డింగ్ విషయంలో ఇంత జాగ్రత్త పడుతున్నారు కాబట్టే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో కొంతమంది ప్లేయర్లు ఏకంగా అద్భుతమైన విన్యాసాలతో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే స్టన్నింగ్ క్యాచ్ లు, మెరుపు ఫీల్డింగ్లు లాంటివి ఎక్కువగా కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో సైతం ఇలాంటి క్యాచ్లతో ఆటగాళ్లు మెరుస్తున్నారు. దీంతో ఇలాంటి ఆటగాళ్లు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాంటి క్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఆస్ట్రేలియా ప్లేయర్ ఖావాజా పట్టిన ఒక క్యాచ్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా మారిపోయింది అని చెప్పాలి. రెండో రోజు మ్యాచ్లో భాగంగా ఇక ఈ ఘటన జరిగింది.  స్టార్క్ బౌలింగ్ లో వేసిన షార్ట్ పిచ్ బంతిని అయ్యర్ బ్యాట్ తో హుక్ చేశాడు. అయితే దీంతో బంతి నేరుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలోనే ఖావాజా ఆ బంతిని నేరుగా గాల్లోకి స్పైడర్ మాన్ లాగా ఎగిరి మరి పట్టుకున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ముందుగా ఖావాజా ఆ బంతిని అందుకోలేడు అని అంచనా వేశాడు. కానీ ఖావాజా అందుకున్న తీరు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత క్రికెట్ ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. అతని బాడీలో ఎముకలు ఉన్నాయా లేకపోతే స్ప్రింగ్ లు ఉన్నాయా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: