ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్లో ఉన్న అత్యుత్తమ బ్యాటర్లలో అటు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ అజాం కూడా ఒకడు అన్న విషయం తెలిసిందే. తన ఆట తీరుతో క్రమ క్రమంగా లెజెండ్ గా ఎదుగుతున్నాడు బాబర్ . ఇక ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. కెప్టెన్ గానే కాదు ఆటగాడిగా కూడా సక్సెస్ అవుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.


 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన కొన్ని రికార్డులను బాబర్ బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఇక అప్పటినుంచి బాబర్ను విరాట్ కోహ్లీతో పోల్చి కంపేర్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇకపోతే ఇటీవలే బాబర్ అజం మంచి ఫామ్ లో కొనసాగుతూ మరో అరుదైన మహిళలు రాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా తన కెరీర్లో 9000 పరుగులు మైలురాయి దాటేశాడు. అయితే అత్యంత వేగంగా ఇలా తొమ్మిది వేల పరుగుల మార్క్ అందుకోవడం గమనార్హం. దీంతో క్రిస్ గేల్ విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు.


 ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా షెఫవర్ జల్మీ జట్టు తరఫున ఆడుతున్నాడు బాబర్. ఇకపోతే ఇటీవల జరిగిన మ్యాచ్లో 64 పరుగులతో రాణించాడు. దీంతో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు. 245 ఇన్నింగ్స్ లలోనే బాబర్ ఇలా 9000 పరుగుల మార్కు అందుకున్నాడు. అయితే వెస్టిండీస్ స్కేల్ 249 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించగా.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 271 ఇన్నింగ్స్ లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక తర్వాత డేవిడ్ వార్నర్ 273 ఇన్నింగ్స్.. ఆరోన్ ఫించ్ 281  ఇన్నింగ్స్ లతో తర్వాత స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: